![]() |
![]() |
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu ). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -168 లో..... సీతాకాంత్ కి భోజనం తినిపించి రామలక్ష్మి వెళ్లిపోతుంటే.. శ్రీలత బయటకి వస్తుంది. పాపం నీ పరిస్థితి తలుచుకుంటే జాలి వేస్తుందంటూ శ్రీలత మాట్లాడుతుంది. నేనొక నిర్ణయం తీసుకున్న రేపే సీతాకాంత్ స్థానంలో నా కొడుకుని చైర్మన్ ని చేయబోతున్నాని అనగానే అంటే ఇదంతా చేసింది మీరేనే? నీ కొడుకుని చైర్మన్ ని చెయ్యడం కోసం సీతా సర్ ని ఈ కేసు లో ఇరికించారా అని రామలక్ష్మి అంటుంది. అని చెప్పానా? ఆధారాలు ఉన్నాయా అని శ్రీలత అంటుంది. చెప్పకపోయిన అసలు నిజమేంటో ఏం జరిగిందో కనుక్కుంటానని రామలక్ష్మి అంటుంది.
![]() |
![]() |